నా నీవే

 ఒక అమ్మాయి  ఉండేది ఆ అమ్మాయి సాయాంకాలం కాగానే అలా ఆ సముద్ర అలలను తాకుతూ ఉండేల అడుగులు వేస్తు కాసేపు ఆ కెరాటాల అలజడిని చూస్తు సంతోష పడేది ఒక సారీ చూస్తు  ఆ సముద్రంలోకి రాయి వేసింది ఆ రాయి వేసిన కాసేపటికి ఇక ఇంటికి వెళ్ళింది రాత్రి అయ్యింది ఇక ఆ అమ్మాయి నిద్రపోయే సమయంలో ఒక ఆలోచన వచ్చింది ఆ రాయి వేసాను కదా అది ఇప్పుడు ఎక్కడ పడింది ఏలా ఉందో అందులో అని చూస్తే బాగుంటుంది కదా అనుకుని నిద్ర పోయింది తరువాత ఇక ఉదయం తొందరగ లేచి అన్ని చేసుకుని సమయం ఇంక అవ్వకుండానె ఆ సముద్రాన్ని చూస్తు వెళ్ళాలి అనుకుని  సముద్రంలోకి మెల్లగా వెళ్ళింది...ఆ సముద్రం తన ప్రపంచం అంత చూపించింది సంతోషాల వనం , బాదగ బందించే వలలు చిక్కుకున్న ప్రమాదాలు ఒకోకటిగా చూపిస్తుంది చివరిగా పచ్చదనంతో చిలికించే రంగుల హరివిల్లును చూపించింది అలా సముద్రం హృదయంపై ఉన్న రాయిని చూసింది ....తను ఆ హృదయంపై ఉన్న  రాయిని తాకగానే అది ముత్యంలా మెరిసింది....అప్పుడు తను అది తీసుకుని బయటకు వచ్చేసింది ఇంటికి వెళ్ళి ఇది వేసినపుడు రాయి కాని నాకు ముత్యంలా ఇచ్చింది తన  ప్రపంచం ఎలా ఉన్న హృదయం చాల మంచిదేమో అందుకే నేను రాయి వేసిన ముత్యంలా చూసుకుంది అని సంతోష పడింది.......ఆ సముద్రంలానే నేను కూడ  .....నా చుట్టు ఉన్న వాళ్ళతో  నేను ఎలా ఉన్న  ఏం మాట్లడిన ఆ మాటల్లో నిజం నిజయితీగ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది... దూరంగ ఉన్న నన్ను చూడకు నీతో నీ దగ్గరగ ఉన్న నన్ను చూడు...నీ మాటకి విలువనిచ్చె నా మనసును  చూడు నీ స్నేహాన్ని ప్రేమని నా హృదయంలో నీ గురించి ఆలోచించే నా    ఆలోచనలను అర్థం చేసుకో నీ మనసు తపించె బాదని నేను అర్థం చేసుకనే  నన్ను చూడు నా బయట ఉన్న ప్రపంచం కాదు నాలో నీకు చూపించే నీ ప్రపంచాన్ని చూడు ఇక ఎప్పటికీ మన మద్య ఇలా అపార్థాలు రాకుండ ఉంటాయి.......ఆ సముద్రంమే అంతలా దాచుకున్న వాటిని చూపించినపుడు నీ కోసం నాలో ఉన్న నీ ప్రపంచాన్ని నీకు చూపించన చెప్పు ..........కాలమే కదా అది ఏమి చేసిన మన మద్య స్నేహం బాగుండాలి అంతే ......నీ గురించి నీ కన్న నాకే బాగ తెలుసు ఎప్పుడు ఇక నీ ఆలోచనలలో ఏది రానివ్వకు.........మా కథ చదువుతున్న మీరు కూడ అంతే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీతో మీ గురించి ఏం మాట్లాడుతున్నారో అది మాత్రామే చూడండి ఇతరులతో ఎలా ఉన్నారు అని చూడకండి ఎందుకంటే నటించే వాళ్ళ దగ్గర నటనలే చేయల్సి వస్తుంది కాబట్టి బాద పడే ఓపిక వాళ్ళకు ఉండదూ అందుకే వాళ్ళు కూడ అలా మారిపోతారు ఒక్క వాళ్ళ ఇష్టాన్ని కోరుకునే వాళ్ళ దగ్గర మాత్రామేవాళ్ళేంటో చూపిస్తారూ........మీ రచయిత.......🌍🍫


Art by Veni

Comments