గ్రంథాలయ నిధి

 


చాల సంతోషంతో గడిచే క్షణాల కోసం ఎదురు చూసిన కలలకు నిజమనే బాదని వదిలేసుకుని మనసులో కదిలిన ఇష్టమైన స్నేహంతో కలిసినరోజు ....తన చిన్ని చేతులతో నా చేయి పట్టుకుని అడుగులలో  తన పాదాలతో మువ్వల శబ్దం చేస్తు వెళ్తు ఉంటె ఆ స్వరాలకు పక్షులు కూడ గానం చేస్తున్నాయి.పైరు పంటల మద్య అల్లరిచేసే చిన్నవాళ్ళం అయ్యాము.అలా మాటల్లో మరిచిన మా స్నేహం  అవధులేధాటిన సంతోషానికి ఆశావైఖరిని చూపించింది...అలల తీరాన్ని తాకిన స్నేహంతో గుర్తులన్నీ దాచేసాము.  నడిచిన అడుగుల గుర్తులన్ని ఇసుకపై ఉన్నాయి అవి చెదిరేలోపే వాటిని మా చేతిలో తీసుకొని మాతో పాటే తెచ్చుకున్నాము.. కిరణాల కౌశల్యంలో కలిగిన కాసంత క్షణాలను స్నేహమైన ఇష్టాలతో నింపుకున్నాము...అంటే మా జీవితం మొత్తం కలిసిఉండాలన్న జరగదేమో అందుకే రోజులో ఒక సారి అయిన ఆ కిరణాల నుంచి వచ్చే కౌశల్యాన్ని చూస్తు సంతోషంగ కొన్ని మాటలను మనసులో నింపుకొంటున్నాము వైశావలిలో వర్షంలా జారే చినుకుల చిత్రంలో స్నేహం వడివడిగా పొలమారేల తలుచుకనేంత ఆడుకోన్నాము.......ఆ వర్షం కురిసినపుడు గిరిగింతలు చేస్తు చిందులు వేసాము చల్లనైన వానలో బురదజల్లే గంతులు ఎగురుతు  బాగ చిత్రించుకున్నాము..మళ్ళి మళ్ళి గుర్తుచేసుకుని పొలమారేల స్నేహంతో కలిసి జీవించాము....పలకిరింపులే వినిపించని వెన్నెలను చూస్తు చలించిపోయాము అమ్మ ప్రేమను గుర్తుచేసుకొని...ఆ వెన్నెలను చూసి అమ్మ చెప్పె మాటలు వింటుంటే ఇంక ఎవరి మాటలు వినిపించవు..అలా మా ఇద్దరి మాటల్లో ఇంక వేరే వారి మాట కనిపించదు వినిపించదు.. అంతగా అమ్మ ప్రేమ దగ్గర అలసిపోయి నిద్రిస్తాము... వినలేవా మనసునై చెపుతున్నా అన్నట్టు తట్టి లేపే మా స్నేహం దూరం రానివ్వకా..మా ఇద్దరి మద్య ఏదైన జరిగి దూరం వస్తే మా హృదయం మాకు తట్టి వినిపిస్తుంది మీరు ఒకే ప్రాణమైన స్నేహం కలిసేఉండాలి అని..బదాలే చెప్పుకోవాలి సంతోషమే నేర్చుకోవాలి...మాకు ఎన్ని బాదలు వచ్చిన అన్నీ చెప్పుకోంటాము సంతోషంగ ఆ బాదని మర్చిపోతాము...గడియలే లేవా గండాలు రానివ్వక గడపడానికి అని ఎవరయిన దిష్ఠి పెడితే.. గడిచిన కాలం గతంలా మార్చుకుని  సంతోషంగ బ్రతుకుతాం....స్నేహం ప్రత్యేకం స్నేహితులు ప్రతిష్ఠం నేస్థంలా నేను నువ్వు అంటు కలగగలుపుకొనే ప్రాణంలో జీవనానికి జీవం ఇస్తూ ఉండేలా చూసుకుంటున్నాము ... వసంత వనంలో వరంలా వర్ణించాము మా స్నేహాన్ని..అన్ని ఋతువులతో కలిసిన మా స్నేహాన్ని ఒక్కొక్క భావంతో కొత్తగా వర్ణించి గ్రంథాలయం చేసాము....సహాస్రనామాల సాహిత్యం మా స్నేహం...ఎన్నో నామధేయాలతో అక్షరాలతో దివిగా దర్శణం చేసాము ఇద్దరము....కలిసే ప్రాణం ఎవరికైన భ్రమే...కాని మా ఇద్దరికి ఒకటే సమాధానం ఉంటుంది. చింతచెట్టు ఎక్కి తెచ్చిన చింతచిగురుతో చేసిన అమ్మ చేతి వంట ఒగొరగురుగా పుల్లనైన తియ్యదనంతో భలే తిన్నాము....అలా మా స్నేహాన్ని పర్వతాల నుంచి జారే నీటి ధారలో మంచులా గడ్డకట్టే భావాలతో...కరిగిపోయే బాదలతో ..ఒకే చోట కలిసున్నాము సముద్ర అందాలలో మా స్నేహాన్ని వదిలేసి వచ్చేసాము ఎప్పటికీ కలిసే ఉండాలని..

Art by Veni

Comments