నా చిన్న కథ
నా ఆలోచనల నుంచి కదిలిన ఒక చిన్న కథ మీకోసం.......ఎడారిలో ప్రయాణం కష్టమే .....ఒక చోట చెట్టు ఉంది ఎడారి ప్రయాణం చేసే వాళ్ళందరు ఆ చెట్టు దగ్గర ఉండాలనుకున్నంత వరకు ఉండి తిరిగి వెళ్ళెవాళ్ళు ఆ చెట్టు అందరికి తనకున్న ఆ కాస్త నీడానే ఇచ్చేది .....ఆ చెట్టుకు ఒక కోరిక ఉండేది ఎవరయిన ఒకరు తన కోసం ఎప్పుడు వచ్చి పోవాలని అన్ని తనతో చెప్పుకునే ఒక పర్సన్ ఉండాలి అని ఆశ ఉండేది ...అందుకే ఎవరు తన దగ్గర వచ్చిన ప్రేమగ నీడనిస్తు చూసుకునేది తన కల నిజం అనిపించేల ఒకరు వచ్చారు నీరు పోసి నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండు అని ఆ కాసేపు సరదాగ అలసట తీర్చుకుంటు మాటలతో మనసులో ఉన్నవన్ని చెప్పేసింది తరువాత వెళ్ళిపోయింది కాని తిరిగి ఎపుడు రాలేదు నా కల నిజం అయ్యింది అనుకునే లోపే నువ్వే సమాధానం చెప్పేసావ నేను కాదు నీతోడు అని మనసులో తానకు తానే చెప్పుకుంది ఆ చెట్టు .....మళ్ళి ఇంకో సారి వచ్చారు కాని వచ్చిన వారు తనకు ఏమి చెప్పలేదు వాళ్ళ మనసులోనే అనుకున్నారు నువ్వు కూడ ఇలా ఒంటరిగ ఉంటావా సరే నాకు కష్టం వచ్చిన ప్రతి సారి నీ దగ్గర సహాయం కావాలి నేను ప్రయాణం చేసే ప్రతి సారి నువ్వు నాకు ఇలా నీడనీ ఇస్తావ అని చెప్పుకుని వెళ్ళిపోయింది .....ఆ చెట్టు చాల బాద పడింది ఇక ఎవరు నాతో ఉండరు నేను బ్రతికినంత వరకు సహాయం చేయాలి కాని నాకంటు ఇంకొకరి సహాయం రాదు అనుకుని తనలో తానే చాలానే వేదన పడేది ......అలా రెండేళ్ళు గడిచి పోయాయి ....అయిన ఎవరు లేరు...కాని తన పక్కనే ఒక చిన్న మొక్క వచ్చి అది పెద్దగా చెట్టులా మారి తనకు కనిపించడానికి మూడేళ్ళు పట్టింది .....అప్పుడు చూసింది నాకోసం నాల ఉన్న ఇంకోకరు నాతోనే ఉండిపోయలా ఒకరంటు ఉన్నారు నేను ఇక నా కలని నిజం చేసుకున్నాను నా ప్రపంచం నువ్వె అందరికి సహాయం చేస్తాను కాని నా బాదని సంతోషాన్ని వినడానికి బెస్ట్ ఫ్రేండ్ నువ్వు ఉంటే చాలు నీకు నేను మాత్రామే ఉన్నాను మనం ఇక ఎప్పుడు ఇలానే ఉండాలి అని చాల సంతోషంగ ఫీల్ అయ్యారు........ఇది కథ రియల్ స్టోరి చెప్పనా ఆ చెట్టులాగే నేను నా లైఫ్ లోకి చాల మంది వచ్చారు నా సంతోషంలా ఎప్పుడు ఉంటాను అని చెప్పారు కాని వాళ్ళ లైఫ్ లో ఇంకొకరు వచ్చేంత వరకే అని అర్థం చేసుకోలేక పోయాను...కాని నిజంగ ఇక చాలు ఎవరు వద్దు నా లైఫ్ లో నేను కోరుకున్న నా బెస్ట్ ఫ్రేండ్ అంటు ఎవరు లేరు అనుకునే సమాయానికి పరిచయం చేసుకుంది నాకు నీ స్నేహం జీవితం మొత్తం కావాలి అని .....నా కల కూడ నిజం అయ్యింది.....ఇప్పుడు full fill dreams ఇక ఏమి లేదు తనకున్న dreamsని ఫుల్ ఫిల్ చేయడం ఒకటే ఉంది ....ఇది...నా నిజమైన కల.....ఎడారిలో ప్రయాణం అయిన ఒంటరిగా చేయవచ్చు కాని జీవితంలో ఎవరిని వద్దు అనుకొని ఉండగలం కాని జ్ఞాపకాలుగా గుర్తు వస్తుంటె ఆ సమయంలో నీతో నువ్వే లేనట్టు చాల బాదగ ఉంటుంది .....మీ జీవితంలో కూడ అంతే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నిన్నుగా కోరుకునే మనిషి వస్తారు...ఉంటారూ కాలం దూరాన్ని ఇవ్వచ్చు కానీ మనసులో నువ్వు లేవు దగ్గర అని నిన్ను మళ్ళీ కలిసే ఆ సమయం కోసం నిరీక్షణ చేస్తూ కలుస్తారు. కలిసీ ఉంటారు అది నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన నీ జీవిత భాగస్వామి అయిన ...ఎవరయిన కాని నీ ప్రతి క్షణం వాళ్ళతో చెప్పుకునే వాళ్ళు ఉంటారు......అర్థం అయ్యిందా కాని ఒకొక్క సారి నా ఆలోచనలు కూడ తప్పుగ అవుతుంటాయి ....తన విషయంలో ఎప్పుడు అలా కాకుడదు అని ఆ దైవంతో కోరుకోవడం కంటే తనకే అన్ని చెప్తూ ఉంటాను మనల్ని మనం అర్థం చేసుకుంటె మన స్నేహం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని .........నా కథ చదివినందుకు దన్యవాదాలు మళ్ళి ఎప్పడు అయిన కలుస్తాను...............🌍🌎🌍🌎🌍🍫
Art by Veni
Comments