ఇరువురి ప్రాణం

 ఒక కథకి పాత్రలను చూపిస్తే చాలదు అంతర్వినేధంతో భావించి కదిలించాలి ప్రాణం ఉన్న కథలా.....ఒక నాటి పరిచయాలు అరుదైనవి అలాగే నిలిచిపోయేవి...మరి ఈ పరిచయాలు ఈ నాడు కలవలేనివి కలిసి బ్రతకలేకపోతున్నవి....మరి ఇలా ఉన్న సమస్యలలో  ఒకరికొరకు ఇంకొకరికి వచ్చిన సమస్య..... అది తీర్చడానికి చేరువకావాలన్నా  ప్రయత్నం....మరి ఆ సన్నివేషం మొదలయింది  కాలేజ్ పార్కింగ్ దగ్గర..... అలా చూసనో లేదో ఇలా పడ్డాను అని ఎవడో ఒకడు సాంగ్ పెట్టాడు....అది వింటూ ఉన్నా... అల్లరి చేసే శబ్దాలు చాల వినిపిస్తున్నాయి అయిన మనసు మరవలేదు....ఉన్నపాటుగ ఎక్కిళ్ళు ఎంతకీ తీరిపోలేదు .....ఏంట్రా ఇలా కొట్టేస్తున్నావు అంటు ధబేలున తిట్టుకున్నాను...అంతలో నా వైపు ఎవరి చూపులో నవ్వేస్తూ కనిపించాయి... పాట నిజమైంది నాకిపుడే అంటూ అనుకున్న.....ఫస్ట్ లుక్ అదే పరవశమైంది నా మది.... చాల సంవత్సరాల తరువాత సేమ్ ఫీలింగ్ సేమ్ లుక్ అప్పుడు మాట్లాడుకున్నాం .....మనసు దాటి మధువుల మాటలు వస్తే..... మంధారాలలో తేనేల పట్టుల జివ్వుమనిపిస్తాయి....అలా ఉంది నా పరిస్థితి తను చెప్తుంటే....తన ఫ్రేండ్ చాల అందమైనదంట తనకి ఒక ప్రేమ ఉంది అది తను చెప్పుకోలేక పోయింది ఎలా అయిన కనిపించేల చేయాలి అని చెప్తుంది....చెప్పు మరి ప్రయత్నం ఫలిస్తుంది....విఖ్రేథ తన పేరు తమ్ముడు నాన్న అమ్మ అదే తన సంతోషం....నాతో కలిసే సంతోషం చిన్న కాఫితో వచ్చే సమయం...అదే మా ఇద్దరి ప్రపంచం ....కాలేజ్ స్టాట్ మొదటి రోజులో లేట్ ఎందుకు అని ముందుగానే వెళ్ళింది...సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయ్యింది బాగనే గడిచింది...అన్ని క్లాసులు ఇలా జరిగాయి...నెస్ట్ ఛాప్టర్స్ స్టార్ట్ చేసారు బిజి బిజీ లైఫ్ లో ఇంకెంతో బిజిగా మనతో  బిజినెస్ చేసేది  ఒక్క చదువు మాత్రమే ....ఎంత వరకు ఉంటామో అంత వరుకు చదువు మనల్ని వదిలి వెళ్ళదు కాబట్టి....అలా పరీక్షలు అన్ని మంచి గ్రేడ్ తో పాస్ అయ్యేదీ....అందరితోను బాగుండేది సరదాగ ....ఉన్నపాటుగ ఎవరిని చూసిందో తెలిదు ప్రేమకి ప్రాణం ఇచ్చేసింది.....మా సంతోషం ఎప్పుడు అన్నాను కాఫీ సమయం అన్నా కదా ....తను నా దగ్గర ఏది దాచదు కదా చెప్తుంది ....నింగితారలలో వెలిగిన వెన్నెలలా భూవినేలే ఇంద్రునిలా కనిపించేల చేసిన ఆ అబ్బాయి చాల ఇష్టమయిపోయాడు ....చక్కనైన చెన్నేకాడిలా భలే మెరుస్తూ కనిపిస్తాడు...మంచితనం మంత్రాలయం అయినట్టు అంత నమ్మకంగ ఉండే ధైర్యవంతుడు...ఏ మాటకి ఆ మాట కని ఊరగాయ ఊరడిస్తే ఎలా ఉంటుందో తనని చూస్తూన్నప్పుడు మనసు మతిభ్రమించడం నిజమైనది ...అందానికి ప్రేమ కాదు చూడగనే నచ్చాడు తెలుసుకొంటునే నాలో ప్రేమ కొంచం కొంచం ప్రాణధాతగా ప్రేమకే అమర్పణం చేసేసుకుంది నన్ను.....సహాయానికి సరిపోల్చలేనువంటి సస్సంపన్నుడుగా పుట్టాడేమో అనిపిస్తుంది...తనతో మాట జారి మనసును చూపించాలని చాల సార్లు ప్రయత్నం చేసాను .....తలవర కలవర కలాతీతంతో మరోభయం కనిపిస్తు ఆపేస్తుంది నన్ను....ఇలానే ఉండిపోతానా అనిపిస్తుంది ...ఏది ఏమైన తనకు చెప్పగలితే బాగుండు అని విఖ్రేత నాతో చెప్తుంది...తరువాత రోజు వెళ్ళి మాట్లాడింది కని ప్రేమని అయితే చెప్పలేదు...ఇంక ఎప్పటికి చెప్పలేని పరిస్థితి కూడ వచ్చేసింది...నాన్నకి వేరే చోటకి ట్రాన్సఫార్మర్ అయ్యింది ..ఉన్నపాటుగా వెళ్ళాల్సివచ్చింది... వెళ్ళిపోయింది ఇదే తన చివరిగా మాట వినింది...అవునా అక్షి మా వాడికి ఇలాంటి లవ్ సీన్ జరిగింది ....మా వాడి పేరూ ఖేతన్ ...అన్న, అమ్మ, నాన్న, చెల్లి ఇదే వాడికున్న బందుత్వం, స్నేహం,ప్రేమ ....సరదాలతో అల్లరిగా ఉండేది ఇంట్లో మాత్రమే ....చాల మంచి మనసు గల వ్యక్తి.... చాల ఇష్టం నాకు వాడంటే....మా ఇద్దరికి ఉన్న సమయం అలల తీరాలలో అలుపు వచ్చే వరకు మాట్లాడుతూనే ఉండేది ఆ సాయంత్రాలు...అన్ని సంతోషంగ ఏదో కొత్తగ చెప్తునే ఉంటాడు.... సవ్వడే లేని సన్నాయిలా దిగులుగ కనిపిస్తు ఉన్నాడు ఒకసారి ...సరే చెప్తాడు కదా చూద్దం ఏంటో అని ....ఆ అమ్మాయి పేరు తెలియదు కాని చాల చెప్పాడు...చాల రోజులు నుంచి ప్రేమిస్తున్నాను చెప్పాలంటే కుదరడం లేదు ...అమ్మాయి ఎలా ఉంటుందో తెలుస రా పర్వతాల శిఖరములలో ప్రకృతి అందాలు మెరుస్తూ ఉన్నట్టు తనలో తనని కొట్టెత్తి చూపించే ముఖచిత్రాలు..తన అధరములే పల్లవి పాడితే నా అధరాలు రాగం తీసే తన నామమే....మువ్వల్లో మాణిక్యంలా కనిపించె కళ్ళు....నడకలో నయనాలు వంచేస్తున్నట్టు ఉంటుంది....చీరకట్టిన చెలితారకల చలిపుట్టిస్తుంది.....చిక్కటి మజ్జిగతో వెన్నని చిలికేల తన నడుముతో నన్ను చిలుకుతున్నట్టు కలవరపేట్టేస్తుంది.. శిల్పకారుడికే భ్రమకల్పిస్తుంది అంతటి కన్యక .....తన కళ్ళు కవ్వములవలే చూడముచ్చటైనవి...తనని రోజు చూస్తునే ఉండిపోవాలి అనిపిస్తుంది...తనే నన్ను తనవైపు చూసేల చేస్తుంద అనే అనుమానం వచ్చేంత ప్రేమ పుట్టిస్తుంది... ఇక ప్రవర్తన గురించి అయితే అన్ని లక్షణాలతో తనువుకే తామర పువ్వులను చూపించనట్టు అణుకువైన కన్నెసింగారం...మాటల్లో మాయచేస్తుంది ఎప్పుడు సంతోషంగ అందరికి సంతోషాన్ని ఇస్తుంది...విలువైన వైడుర్యాల కన్న వన్నె పెట్టిన వెన్నెల తను....నా మనసే జారిందో నేనే వెళ్ళిపోయానో తనలో ఐక్యం కావాలని ఆశ పెరిగిపోతుంది....మంచి అమ్మాయి ఎంతో సహయం గుణాలను కలిగిన లక్షణమైనది..అ మంచితనమే నన్ను ప్రేమకి దగ్గర చేసింది... హృదయంలో తనని కోలువుంచాలని లేదు నా ఇంట అందరి కళ్ళకు కోమలమైన కుసుమసౌధామీనలతో ప్రతి రోజు కనిపించేల చేసుకోవాలని ఇష్టపడుతున్న....తనతో ఈ విషయం వెంటనే చెప్పేస్తాను అని నాతో అన్నాడు...మార్నింగ్ వెళ్ళాడు కాలేజ్ కి అ అమ్మాయి రాలేదట ....చాల ఫీల్ అయిపోయడు ఇలా జరిగిందేంటి అని....వారం రోజులు నెల రోజులుగా అయ్యాయి అయిన కాలేజ్ కి రాలేదు ....సంవత్సరం  కాగ వస్తుంది ఇప్పుడు అయిన వస్తుంద అని ప్రతి రోజు ఎదురుచూస్తుంటాడు ....మరి మీ విఖ్రేత ఎక్కడ ఉంది ఇప్పుడు అక్షి ...తెలీదు తనని నేను ఆ రోజు చివరిగ చూడటం ...మరి మనం ఏం చేయాలి  క్షత్రి ఇప్పుడు....వాళ్ళ కాలేజ్ ఏది ? ...వాసవి కాలేజ్ ...అరే మా వాడు అక్కడే చదివేది ......కోర్స్ ఏం చేస్తుంది ...  M.A చేస్తుంది...ఇద్దరు ఒకే కాలేజ్ ఒకే  గ్రూప్ అయితే మా వాడు లవ్ చేసింది నీ ఫ్రెండ్ నా ....ఏంటి నిజమా మరి నేను ఎప్పుడు అబ్బాయిని చూడలేదు ....నేను అమ్మాయిని చూడలేదు .. సరెలే ఇప్పుడు ప్రక్టికల్స్ అన్నింటికి రివార్డ్ ఇస్తారుగా తను వస్తుంది అని ఇద్దరు మాట్లాడుకుంటారు.....ఇంక తెల్లారింది తెల్లనైన మేఘాలతో వెచ్చనైన కిరనాలతో అలా చాటున ఉన్న సూర్యప్రభువు వస్తు ఉన్నాడు ....వీళ్ళు ఇద్దరు వాళ్ళు ఎప్పుడు కలుస్తార అని ఎదురు చూస్తున్నారు ....సో ఇప్పటి వరకు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ కథ చెప్పారు కద ...ఇక్కడ నుంచి నేను చెప్తాను ....నువ్వెవరు అని ప్రశ్న వద్దు ఈ కథ రచయితని .....అ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకుని కాలేజ్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఆ అమ్మాయి వచ్చి వెళ్ళిపోయింటుంది...ఈ అబ్బాయి చాల బాద పడుతు అక్కడే క్లాస్ రూమ్ లో ఉండిపోతాడు...ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చింటుంది..ఫ్రెండ్ స్యాడ్ గా ఉండటం చూసి బాద పడుతుంది...తను అలా తన దగ్గర కాసేపు కూర్చునేస్తుంది....తన మనసుకు చాల దూరం అయిందిగ ఇన్ని రోజులు అలాగే నిద్రలో మరువనిస్తూ ఉంటుంది.. అప్పటికే సమయం ముగిసిపోవడానికి ఇంక కొన్ని గంటలే ఉంటాయి.. అప్పుడు ఇంక ఆ అబ్బాయి ఇంటికి వస్తాడు...ఇద్దరికి ఒకే సారి హృదయం ఉన్నట్టు ఉండి నెమ్మదిగా అయిపోతుంది ఆగిపోతుంద అన్నట్టు ఊపిరి ఊహాలని కల్పిస్తుంది..అప్పుడు అబ్బాయి ఇక్కడ నువ్వు ఇలా అని అడుగుతుండగా ...నా ఫ్రెండ్ తను తన కోసం వచ్చాను ...తను నిన్నే దగ్గర చేయాలని నీ దగ్గర చేరుకుందేమో అనిపిస్తుంది అని విఖ్రేత ,ఖేతన్ కి చెప్తుంది...అప్పుడు ఖేతన్ తన మనసు మాటని వినిపిస్తాడు నిజమైన కలవైన నా కనులు అలిసిపోనివ్వకుండ ఎదురుచూసేల చేసాను నీకోసం నువ్వంటే చాల ఇష్టం... నన్ను పెళ్ళి చేసుకుని మా అందరి కళ్ళముందు మా ఇంట్లో కనిపిస్తావా... నాతో జీవితం మొత్తం కలిసి హృదయంలో మన ప్రేమని చూపిస్తావా ......ఈ మాట వినాలని నేను నీకు చెప్పాలని ఎంతో సమయం వృధా చేసాను ..నాకు నువ్వంటే ఇష్టం ...నీ ప్రేమలో ఏనాడో నేను కలిసిపోయాను నీ జీవితంలో కూడ కలిసే బ్రతుకుతాను...ఇద్దంతా చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ మేము కూడ కలిసే ఒకే చోట ఉంటాము అన్నమాట మా ప్రేమ కూడ మీలాగే ఉంటుంది అని చాల సంతోషిస్తారు.....నిజానికి మీకు ఒక విషయం చెప్తాను మనం ప్రేమించే వాటికి మాటలు వస్తే అవి మనల్ని తిరిగి మాట్లాడితే చాల బాగుంటయ్ కదా ...కని అలా ఎప్పుడు జరగదు ..అందుకే సినిమా చిత్రాలలో ఇలా జరుగుతాయి....అబ్బాయి ఫ్రెండ్ తన బైక్ ... అమ్మాయి ఫ్రెండ్ తన స్కూటి...సో ఇలా ఆ బైక్ ఆ స్టూటి ప్రేమ మాటలు చెప్పాయి .... వాళ్ళా కథని నేను చెప్పాను...బైక్ లవర్స్ ఎవరు ఉండరండి అబ్బాయిలకి అమ్మాయిలంటే ఎంత ఇష్టమో తెలియదు కాని వాళ్ళ బైక్ మాత్రం పిచ్చి ఉంటుంది...అలా వాటికి భాష స్పందన లేకపోయిన ఎప్పుడు ఒకటిగానే చూసుకుంటారు ...అమ్మాయిలు చాల తక్కువ మంది ఉంటారు ఇలా ఇష్టపడటంలో... అలాంటి అమ్మాయే విఖ్రేత...ఊరి వదిలి వెళ్ళిపోవడం వలన ఆ స్కూటిని తన ఫ్రేండ్ కి ఇచ్చేస్తాడు వాళ్ళ నాన్న నీ కూతురికి అవుతుందిలే అని...సో ఆ విధంగ అక్షి వీళ్ళ ఇంట్లో ఉంటుంది ..పార్కింగ్ లో వీళ్ళు ఎప్పుడు కలిసి ఒకే చోట కనిపించరు ..బైయ్ కూడ చెప్పుకోరు ...అలా వారికి ఎది తెలియదు...ఇది స్టోరి ఎలా ఉందో  తెలుకోవలని లేదు... అలా వారు కలిసి ప్రేమని ప్రేమిస్తు అక్షిని,క్షత్రిని ప్రేమగ చూసుకుంటారు.


Touch 👉🏻Art by Veni

Comments